మరో ప్రపంచం,
మరో ప్రపంచం,
మరో ప్రపంచం పిలిచింది..
పదండి ముందుకు,
పదండి త్రోసుకు..
పోదాం, పోదాం పైపైకి..
కదం త్రొక్కుతూ,
పదం పాడుతూ,
హ్రుదంత రాళం గర్జిస్తూ-
పదండి పోదాం,
వినబడలేదా
మరో ప్రపంచపు జలపాతం?
దారి పొడుగునా గుండె నెత్తురులు
తర్పణ చేస్తూ పదండి ముందుకు
బాటలు నడచీ,
పేటలు కడచీ,
కోటలన్నిటిని దాటండి..
నదీ నదాలు,
అడవులు, కొండలు,
ఎడారులా మన కడ్డంకి?
పదండి ముందుకు.
పదండి త్రోసుకు
పోదాం పోదాం పైపైకి..
ఎముకలు క్రుళ్ళిన,
వయస్సు మళ్ళిన
సోమరులారా చావండి
నెత్తురు మండే
శక్తులు నిండే
సైనికులారా..రారండి..
హరోం హరోం హర
హర హర హర హర
హరోం హరా అని కదలండి
మరో ప్రపంచం
మహా ప్రపంచం
ధరిత్రి నిండా నిండింది..
పదండి ముందుకు పదండి త్రోసుకు
ప్రభంజనం వలె హోరెత్తండీ
భావ వేగమున ప్రసరించండి
వర్షుకాభ్రముల ప్రళయ ఘోషవలె
పెళ పెళ పెళ పెళ విరుచుకు పదండి
పదండి
పదండి
పదండి ముందుకు
కనబడలేదా మరో ప్రపంచపు
కణకణ మండే త్రేతాగ్ని?
ఎగిరి, ఎగిరి, ఎగిరి పడుతున్నవి
ఎనభై లక్షల మేరువులు..
తిరిగి, తిరిగి, తిరిగి సముద్రాల్..
జలప్రళయ నాట్యం చేస్తున్నవి..
సలసల క్రాగే చమురా? కాదిది,
వుష్ణరక్త కాసారం..
శివసముద్రము,
నయాగరావలె
వురకండి ముందుకు
పదండి ముందుకు
పదండి త్రోసుకు
మరో ప్రపంచపు కంచు నగారా
విరామమెరుగక మ్రోగింది
త్రాచులవలెను,
రేచులవలెను,
ధనుజయునిలా సాగండి..
కనబడలేదా మరో ప్రపంచపు
అగ్ని కిరీటపు ధగధగలు,
ఎర్ర బావుటా నిగనిగలు,
హోమజ్వాలల భుగ భుగలు?
Friday, November 13, 2009
ఒక రాత్రి(మహాప్రస్థానం)
గగనమంతా నిండి, పొగలాగు క్రమ్మి
బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను
ఆకాశపు టెడారి నంతటా, అకట
ఈ రేయి రేగింది ఇసుక తుపాను
గాలిలో కనరాని గడుసు దెయ్యాలు
భూ దివమ్ముల మధ్య ఈదుతున్నాయి
నోరెత్తి, హోరెత్తి నొగులు సాగరము
కరి కలేబరములా కదలదు కొండ
ఆకాశపు టెడారిలో కాళ్ళు తెగిన
వొంటరి వొంటేలగుంది జాబిల్లి
విశ్వమంతా నిండి, వేలిబూదివోలె
బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను
బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను
ఆకాశపు టెడారి నంతటా, అకట
ఈ రేయి రేగింది ఇసుక తుపాను
గాలిలో కనరాని గడుసు దెయ్యాలు
భూ దివమ్ముల మధ్య ఈదుతున్నాయి
నోరెత్తి, హోరెత్తి నొగులు సాగరము
కరి కలేబరములా కదలదు కొండ
ఆకాశపు టెడారిలో కాళ్ళు తెగిన
వొంటరి వొంటేలగుంది జాబిల్లి
విశ్వమంతా నిండి, వేలిబూదివోలె
బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను
జయభేరి(మహాప్రస్థానం)
జయభేరి
నేను సైతం
ప్రపంచాగ్నికి
సమిధ నొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం
విశ్వవ్రుష్టికి
అశ్రువొక్కటి ధార పోశాను
నేను సైతం
భువన ఘోషకు
వెర్రిగొంతుక విచి మ్రోశాను
--------------
ఎండకాలం మండినప్పుడు
గబ్బిలంవలె
క్రాగిపోలేదా
వానాకాలం ముసిరి రాగా
నిలువు నిలువునా
నీరు కాలేదా?
శీతాకాలం కోత పెట్టగ
కోరాడు కట్టీ,
ఆకలేసీ కేకలేశానే
------------
నే నొక్కడినే
నిల్చిపోతే-
చండ్ర గాడ్పులు, వాన మబ్బులు, మంచు సోనలు
భూమి మీదా
భుగ్నమౌతాయి `
నింగినుండి తొంగిచూసే
రంగు రంగుల చుక్కలన్నీ
రాలి, నెత్తురు క్రక్కుకుంటూ
పేలిపోతాయి
పగళ్ళన్నీ పగిలిపోయీ,
నిశీధాలు విశీర్ణిల్లీ,
మహాప్రళయం జగం నిండా
ప్రగల్భిస్తుంది
----------------
నే నొక్కణ్ణి ధాత్రి నిండా
నిండిపోయీ-
నా కుహూరత శీకరాలే
లోకమంతా జల్లులాడే
ఆ ముహుర్తాలగామిస్తాయి
--------------------
నేను సైతం
ప్రపంచాబ్జపు తెల్లరేకై
పల్లవిస్తాను
నేను సైతం
విశ్వవీణకు
తంత్రినై
మూర్చనలు పోతాను
నేను సైతం
భువన భవనపు
బావుటానై పైకి లేస్తాను
ప్రపంచాగ్నికి
సమిధ నొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం
విశ్వవ్రుష్టికి
అశ్రువొక్కటి ధార పోశాను
నేను సైతం
భువన ఘోషకు
వెర్రిగొంతుక విచి మ్రోశాను
--------------
ఎండకాలం మండినప్పుడు
గబ్బిలంవలె
క్రాగిపోలేదా
వానాకాలం ముసిరి రాగా
నిలువు నిలువునా
నీరు కాలేదా?
శీతాకాలం కోత పెట్టగ
కోరాడు కట్టీ,
ఆకలేసీ కేకలేశానే
------------
నే నొక్కడినే
నిల్చిపోతే-
చండ్ర గాడ్పులు, వాన మబ్బులు, మంచు సోనలు
భూమి మీదా
భుగ్నమౌతాయి `
నింగినుండి తొంగిచూసే
రంగు రంగుల చుక్కలన్నీ
రాలి, నెత్తురు క్రక్కుకుంటూ
పేలిపోతాయి
పగళ్ళన్నీ పగిలిపోయీ,
నిశీధాలు విశీర్ణిల్లీ,
మహాప్రళయం జగం నిండా
ప్రగల్భిస్తుంది
----------------
నే నొక్కణ్ణి ధాత్రి నిండా
నిండిపోయీ-
నా కుహూరత శీకరాలే
లోకమంతా జల్లులాడే
ఆ ముహుర్తాలగామిస్తాయి
--------------------
నేను సైతం
ప్రపంచాబ్జపు తెల్లరేకై
పల్లవిస్తాను
నేను సైతం
విశ్వవీణకు
తంత్రినై
మూర్చనలు పోతాను
నేను సైతం
భువన భవనపు
బావుటానై పైకి లేస్తాను
Subscribe to:
Comments (Atom)
